Tuesday, 16 August 2011

మరుపురాని తెలంగాణ బిడ్డ..
- ఎన్ వేణుగోపాల్
Jayashanker-1జయశంకర్ అరవై సంవత్సరాల పాటు భావజాల వ్యాప్తి, మేధో కృషి సాగించారు. మూడు దశలలోనూ ప్రజా ఉద్యమాలు వెల్లు వాటిలో పాల్గొన్నారు. గత పది సంవత్సరాలలో రాజకీయ ప్రక్రియను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు. అంటే.. ఆయన తాను చెప్పిన మాటకు అక్షరాలా, మనసా వాచా కట్టుబడ్డారు.

ఆయన ఎన్నోసార్లు వారించినా ఆయనను అందరూ తెలంగాణ సిద్ధాంతకర్తగానే గుర్తించారు. కొందరు కొంత చిన్న చూపుతో తెరాస సిద్ధాంతకర్తగానో.., సలహాదారుగానో కూడా గుర్తించి ఉండవచ్చు. కానీ ఆయన ఆ విశేషణానికి ఎన్నో రెట్లు మించిన తెలంగాణ ముద్దుబిడ్డ. మరుపురాని తెలంగాణ మహావ్యక్తి. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ నిజంగా ఒక అరుదైన మావవతామూర్తి. ఓ పజ్ఞావంతుడైన విద్యావేత్త. ఒక సమర్థుడైన విద్యా నిర్వాహకుడు. ఒక శక్తిమంతుడైన ప్రజామేధావి. ఒక అసాధారణమైన ఆలోచనాపరుడు- ఆచరణశీలి కలగలిసిన మహావ్యక్తి. డెభై ఆరు సంవత్సరాల జీవితంలో ఆరు దశాబ్దాల పాటు ఆయన తెలంగాణ స్వతంత్ర వ్యక్తిత్వం గురించి, తెలంగాణ ప్రజల ఆకాంక్షల గురించి పనిచేశారు. గనుక తెలంగాణ సిద్ధాంతకర్త అనే పిలుపు ఆయనకు అక్షరాలా సరిపోతుంది.

ఉన్నత పాఠశాల విద్యార్థిగా 1952 ముల్కీ ఆందోళనలో పాల్గొన్ననాటి నుంచి, 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మేధో పునాది అందించిన తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ బాధ్యుడిగా ఉన్ననాటి నుంచి, ప్రస్తుత తెలంగాణ ఉద్యమం దాకా అరవై సంవత్సరాల పాటు ఆయన తెలంగాణ ప్రత్యేక అస్తిత్వాన్ని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపడానికి నిరంతరం ప్రయత్నిస్తూ వచ్చారు. 1950 తొలిదినాల నుంచి 2011 దాకా ఆయన తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు గురించి కలగంటూనే ఉన్నారు, పరితపిస్తూనే ఉన్నారు. ఆ కృషిలో ఎవరు కలిసి వస్తే వారి తో కలిసి పనిచేస్తున్నారు. ఆ అర్థంలో ఆయనను తెరాస సిద్ధాంతకర్త అన్నా.. అతిశయోక్తికాదు.

నిజానికి అంగీకరించినా అంగీకరించకపోయినా.. తెలంగాణ కోసం పనిచేస్తున్న రాజకీయ, రాజకీయేతర సంస్థలకూ వ్యక్తులకూ అందరికీ ఆయనే ప్రేరణ. లోలోపలనైనా ఆయన ఆరాధ్యుడు. కాళోజీ తర్వా త ఆ స్థానం దక్కేది జయశంకర్‌కు మాత్రమే. కాళోజీ కైనా తొలిరోజుల్లో విశాలాంధ్ర నేపథ్యం ఉన్నది కానీ జయశంకర్ ఆదినుంచీ తుదివరకూ తెలంగాణను మాత్రమే కోరుకున్నారు. తెలంగాణ వ్యక్తిత్వం మాత్రమే కాక జయశంకర్‌లో విశిష్టతలు ఎన్నో ఉన్నాయి. వ్యక్తిగా ఆయన స్నేహశీలి. వయోభేదంలేని స్నేహం ఆయనది.

మనుషుల పట్ల తోటి మనుషుల ఇబ్బందుల పట్ల ఉద్వేగపూరితంగా స్పందించేవారాయన. ఎవరితోనైనా మృదువుగా, సాదరంగా, ప్రేమతో ప్రవర్తించేవారు. విద్యావేత్తగా ఆయన ప్రజ్ఞావంతుడు. పరిశోధకుడిగా, అధ్యాపకుడిగా, లోతైన విశ్లేషకుడిగా ఆయన కృషి మరవరానిది. ఆయన రచనల్లో ఉపన్యాసాల్లో అది నిక్షిప్తమై ఉంది. ఆయన నిర్వహణ సామర్థ్యానికి అద్దంపట్టే పదవులూఎన్నో ఉన్నాయి. అధ్యాపకుల సంఘ బాధ్యుడిగా, వరంగల్ చందా కాంతయ్య స్మారక కళాశాల ప్రిన్సిపాల్‌గా, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ రిజివూస్టార్‌గా, కాకతీయ విశ్వవిద్యాలయ రిజివూస్టార్‌గా, వైస్ చాన్స్‌లర్‌గా ఆయన నిర్వహించిన బాధ్యతలు, ఆ కాలాలు గర్వంగా గుర్తుంచుకోదగ్గవి.

హనుమకొండలో గడిచిన చిన్నతనంలో ఆయన నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు చేసిన వీరోచిత పోరాటాన్ని కళ్లారా చూశారు. బహుశా దుష్పరిపాలనకు వ్యతిరేకించే ప్రజల పోరాటశక్తి మీద అపారమైన విశ్వాసం ఆయన మనసు మీద చెరగని ముద్ర వేసి ఉంటుంది. అందుకే ఆయన జీవితమంతా పరాయిపాలకుల దుష్పరిపాలన మీద పోరాటానికి సిద్ధపడ్డారు. 1952 విద్యార్థి ఆందోళనలో భాగం పంచుకోవడం మాత్రమే కాదు, ఫజల్ అలీ కమిషన్‌ను కలిసి హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రం కోరుతూ విజ్ఞప్తి పత్రం ఇచ్చిన విద్యార్థి బృందంలో ఉన్నారు.


అలా 1950 ల తొలినాళ్లలో పడిన నిప్పురవ్వ అరవై సంవత్సరాల పాటు ఆరకుండా జ్వలిస్తూనే ఉండింది. అర్థశాస్త్ర అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా ఆయన తెలంగాణ వివక్ష మీద ప్రత్యేకంగానూవూపాంతీయ అసమానతల మీద మొత్తంగానూ విశేష అధ్యయనం చేశారు. ఎన్నో రచనలూ, ఆలోచనలు చేశారు. అవన్నీ తెలంగాణ సమాజంతో ఎప్పటికప్పుడు పంచుకున్నారు. వందలాది సమావేశాలలో, సభలలో పాల్గొన్నారు. 1969 ఉద్యమ సమయంలో తెలంగాణ వివక్షపై ఏర్పాటు చేసిన అసాధారణమైన సదస్సు నిర్వాహకులలో ఆయన ఒకరు.

1969 ఉద్యమం ద్రోహానికి బలి అయి ముగిసిపోయి, వెనుకంజ వేసిన తర్వాత ఆయన చాల నిశ్శబ్దంగా .. ఆ అపజయానికి కారణాలను, పునర్విజృంభణ అవకాశాలను అన్వేషిస్తూ ఉండిపోయారు. ఆ నిశ్శబ్ద కృషి 1990 నాటికి ఫలితాలు సాధించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటు తప్ప మరొక మార్గాంతరం లేదు అనే ఆలోచనకు 1990 లనాటికి బహుజనామోదం లభించింది. 1990 ల మధ్యనుంచీ అనేక సంస్థలు పుట్టుకువచ్చి ఈ ఆకాంక్షను వ్యక్తీకరించడం ప్రారంభించాయి.

ఆ సంస్థలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాటిమీద జయశంకర్ ప్రభావం నిరాకరించడానికి వీలులేనిది.
1971 తెలంగాణ ప్రజాసమితి ద్రోహం తర్వాత మొదటి రాజకీయ నిర్మాణంగా 2001 లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడడం కూడా ఆయన కృషికి కొనసాగింపే. ఈ పరిణామాలతో తన కల సాకారంకాబోతున్నదని ఆయన సంతృప్తి చెందినట్లు కనిపిస్తుంది.ఆయితే అప్పటికి కొన్ని నిరుత్సాహాలు, ఆశాభంగాలు లేకపోలేదు. ఆయన వాటిని సన్నిహిత మిత్రుల దగ్గ రా, అభిమానుల దగ్గరా వ్యక్తం చేసేవారు కూడ. కానీ ‘ఎన్ని లోపాలు ఉన్నా తెలంగాణను సాధించడానికి, ఒక రాజకీయ పార్టీ వెంట ఉండి కృషి చేయక తప్పదు’ అని ఆయన తనకు తాను నచ్చజెప్పుకునే వారు.

తెలంగాణ రాష్ట్ర సాధనకు మూడు ప్రధాన ఆధారాలున్నాయని ఆయన ఎన్నోసార్లు చెప్పారు. 1) రాజ్యాంగ అధికరణం 3 కింద పార్లమెంటులో బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే రాజకీయ ప్రక్రియ. 2) ఆ రాజకీయ ప్రక్రియను సక్రమంగా నడిపే, ప్రజల మద్దతును కూడగట్టే ప్రజా ఉద్యమం. 3) తెలంగాణ ప్రజలలో ప్రతి ఒక్కరిలోనూ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలను నింపే భావజాల వ్యాప్తి, మేధో కృషి.జయశంకర్ అరవై సంవత్సరాల పాటు భావజాల వ్యాప్తి, మేధో కృషి సాగించారు. మూడు దశలలోనూ ప్రజా ఉద్యమాలు వెల్లు వాటిలో పాల్గొన్నారు. గత పది సంవత్సరాలలో రాజకీయ ప్రక్రియను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు. అంటే.. ఆయన తాను చెప్పిన మాటకు అక్షరాలా, మనసా వాచా కట్టుబడ్డారు. ఆ కృషి కొనసాగించడమే ఆయనకు నివాళి.

Ottoman ‘Naginas’ of Hyderabad
 
-Princess Durru Shevar & Princess Niloufer
The seventh Nizam of Hyderabad, Mir Osman Ali Khan, described them as his ‘Nagina’ (precious jewels). He was referring to his  daughters-in-law - both Ottoman princesses - while welcoming them to Hyderabad – a city that would now be their home. Princess Durru Shevar, the only daughter of the last Caliph and former Sultan of Turkey, Abdul Majid Khan, had married Prince Azam Jah, the eldest son of the Nizam. Her first cousin Princess Niloufer had married Prince Moazzam Jah, the second son of the Nizam. The two brothers married the two cousins in a joint ceremony in Nice, France. The weddings, on November 12, 1931, were described as an "event of unparalleled interest and importance not only for Hyderabad but for the world at large." The Caliph, who had been forced to leave the Topkapi palace by Atatürk, and sent into exile in France, had nominated the Nizam's son as heir to the Caliphate. The simple religious ceremony, performed by the Caliph himself, was surprisingly devoid of any ostentation and grandeur.